24 మంది మృతి..20 మందికి పైగా బాలికలు గల్లంతు
లోతట్టు ప్రాంతాలు జలమయం..నీట మునిగిన అనేక ఇండ్లు
న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి అక్కడ వరద బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇక్కడ ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. వీరికోసం సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నది.
ఇక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటివరకు 24 మంది మృతి చెందినట్టు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించినట్టు చెప్పారు. గ్వాడాలుపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్‌లో వేసవి శిక్షణాశిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌ను వరదలు ముంచెత్తడంతో ఇందులో దాదాపు 23-25 మంది బాలికలు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి ఆచూకీ తెలియజేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు, బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
టెక్సాస్‌లో వరదల బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES