Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంఉత్తరకాశీని ముంచెత్తిన వరదలు

ఉత్తరకాశీని ముంచెత్తిన వరదలు

- Advertisement -

నలుగురు మృతి.. సుమారు 50 మంది గల్లంతు
కొట్టుకుపోయిన థరాలి గ్రామం
చార్‌ధామ్‌ :
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీని వరదలు ముంచెత్తాయి. థరాలి గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. దీంతో ఆ గ్రామంలోని చాలా భాగం కొట్టుకుపోయింది. వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందారు. 50 మందికి పైగా గల్లంతయ్యారని స్థానికులు చెబుతున్నారు. వరదల ధాటికి 20 నుంచి 25 హౌటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

జలదిగ్బంధంలో ప్రజలు
వరదల వల్ల ఇప్పటికేే ఉత్తరకాశీలో అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. పరిస్థితి భయానకంగా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించా రు. ఉత్తరకాశీలోని హర్సిల్‌ ప్రాంతంలోని ఖీర్‌గఢ్‌లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సైన్యం సహా విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించాయి. మరో వైపు సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది.

వరదల ధాటికి కొట్టుకుపోయిన ‘థరాలి’
ఆకస్మిక వరదల ధాటికి ధారళి గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. గంగోత్రి, ధామ్‌ యాత్రికుల మార్గంలో ఉన్న ఈ గ్రామంలో వరదలు ఉప్పొంగి ప్రవహించడంతో ఇండ్లు, దుకాణాలు, మౌలిక సదుపాయాలు అన్నీ కొట్టుకు పోయాయి.
అక్కడి స్థానికుడొకరు ‘సుమారు 10-12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. బహుశా వీరు చనిపోయి ఉండవచ్చు’ అని తెలిపారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో సదరు గ్రామస్తులు భయంతో కేకలు వేస్తూ, ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తర కాశీలో బార్కోట్‌ తహసీల్‌లోని బనాలా పట్టి ప్రాంతంలో కుడ్‌ గధేరా వాగు పొంగిపొర్లడంతో దాదాపు 18 మేకలు కొట్టుకుపోయాయి. అనేక మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -