- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం వర్షాకాలం అయినందున మండల ప్రజలు పోలీస్ శాఖ సూచనలు తప్పకుండా పాటించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని మద్నూర్ ఎస్సై విజయ్ కొండ గురువారం ఒక ప్రకటన ద్వారా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ మండల ప్రజల అప్రమత్తత గురించి పలు రకాల సూచనలు చేశారు.
- కరెంటు స్తంభాలను విద్యుత్ వైర్లను ట్రాన్స్ఫార్మర్లను తాకకండి. 2. మ్యాన్ హోల్స్ డ్రైనేజీలను చూసుకొని నడవండి.3. ఉధృతంగా ప్రవహించే చెరువులు వాగులు వద్దకు వెళ్ళకండి. 4. వ్యవసాయ తదితర పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్త. 5. పాత గోడలు పాత ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉంటే ముందు జాగ్రత్తగా ఉండండి.6. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి. ఈ విధమైన సూచనలతో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -