నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు లక్ష్మీ మాత టెంపుల్ వద్ద మహా అన్నదాన ప్రసాదం మండపం నిర్వాహకుల ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు శంకరాయప్పా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం గ్రామస్తులకు అందరూ కలిసి మండపం నిర్వాహకులకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా జరిగే వేలం పాటలు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు పాల్గొని భారీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి సభ్యులు హనుమాజీవార్ మహేష్ , లక్షెట్టి శ్రీకాంత్ , పావుడే వికాస్ , పావుడే నిఖిల్ , పావుడే శివ (నూతన్ కుమార్) , హనుమాజీవార్ ప్రభు, ప్రశాంత్ పటేల్, లక్షెట్టి ఉమాకాంత్, లింగురాం, లక్షెట్టి రాజేష్ , హెచ్. వినాయక్, పావుడే మల్లికార్జున్ , పావుడే భద్రు, మారుతి గొండ తదితరులు పాల్గొన్నారు.
శ్రీసిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద అన్నదాన వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES