- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కంఠం గంగారాం, ఉపాధ్యక్షులు నగేష్, కమిటీ సభ్యులు కర్రోళ్ల సాయి కృష్ణ, బుడ్డొల్ల సాయిలు, అంకం సంతోష్, నందకుమార్, లచ్చే వార్ నితిన్, గ్రామ పెద్దలు, యువజన నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -