నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పెద్ద బజార్ ముదిరాజ్ సంఘం నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముదిరాజ్ సంఘం పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేకమైన పూజలు సమర్పించుకొని అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరిగింది భక్తులు చుట్టుపక్కల కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భువన సంతోష్ సుంకరమోహన్ జక్కం శేఖర్ మందుల రమేష్ జిల్లా సుమన్ పిట్ల పోశెట్టి అరుణ్ పిట్ల సుమన్ సుంకరి శంకర్ రఘు ప్రవీణ్ కుల పెద్దలు కాలనీవాసులు భక్తులందరూ పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ,మామిడిపల్లి గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినారు.
గణేష్ మండపాల వద్ద మొదలైన అన్నదానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES