నవతెలంగాణ – బాల్కొండ
“ఆకలి నివృత్తి కార్యక్రమం” లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ,నల్ల సుజాత ఙ్ఞాన సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కిసాన్ నగర్ గ్రామంలోని గీత వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే పుట్టినరోజు సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ లో మహిళా ప్రధానోపాధ్యాయురాలు దొండి కృష్ణవేణి కు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ ఙ్ఞాన సాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్ జీవన్, ప్రెసిడెంట్ దినేష్ పటేల్, సెక్రటరీ చాకు లింగం, ట్రెసిరరీ వంశీధర్ రెడ్డి, సర్పంచ్ రాం రాజ్ గౌడ్, క్లబ్ మెంబర్ రమాకాంత్, మధుసూదన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



