Monday, December 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు

- Advertisement -

వాటిని అరికట్టేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలి
ఇటాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
మైనార్టీ వెల్ఫేర్‌ హాస్టల్‌ విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించిన సీపీఐ(ఎం) నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వం, హాస్టళ్ల ప్రిన్సిపాళ్ల నిర్లక్ష వైఖరితోనే ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు చోటుచేసు కుంటున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. వాటిని అరికట్టేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల బాలికల హాస్టల్‌కు చెందిన 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. వారంతా కింగ్‌కోఠి, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ఆదివారం కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి విద్యార్థునులను జాన్‌వెస్లీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ల వద్ద వాకబు చేశారు. విద్యార్థునులను, వారి తల్లిదండ్రులను ఘటనకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఆయన వెంట సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సెంట్రల్‌సిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్‌, ముషీరాబాద్‌ జోన్‌ ఇన్‌చార్జి ఆర్‌.వెంకటేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు అచ్చిన లెనిన్‌, అశోక్‌రెడ్డి, తదితరులున్నారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ..నవంబర్‌ 12న పులిసిన పెరుగు, కుళ్ళిన కూరగాయల ఆహారం తినటంతోనే విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటన బయటకు రాకుండా ప్రిన్సిపాల్‌ ప్రయత్నిం చడం ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని తెలియజ స్తోందన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లల్లో ముక్కిపోయిన బియ్యం, నాసిరకం పప్పులు, కుళ్లిపోయిన కూరగాయలు, ఫ్రిజ్‌లో పెట్టిన పులిసిపోయిన పెరుగును నాలుగైదు రోజులు వాడటం, తాగునీటి కలుషితం, వంటి వాటి వల్లనే తరుచూ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు చోటుచే సుకుంటున్నాయని ఎత్తిచూపారు. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, మాదాపూర్‌ ప్రైమరీ స్కూళ్లల్లో అస్వస్థతకు గురైన ఘటనలు మరవక ముందే బాగ్‌లింగంపల్లి ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోందని తెలిపారు. హాస్టళ్ళ నిర్వహణా లోపం, పర్యవేక్షణ కొరవడటం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం సరిగా దన్నారు. బాగ్‌లింగంపల్లి ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించినప్పటికీ ప్రభుత్వానికి చీమకుటి ్టనట్టు కూడా లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు చెల్లించాల్సిన బిల్లులను పూర్తిగా చెల్లించాలనీ, ఘటనలకు కారణమవుతున్న అధికారులపై, కాంట్రాక్టు సంస్థలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పర్యవేక్షణా లోపాలను సరిదిద్ధి, ఆహార భద్రత ప్రోటోకాల్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆహారం వండటానికి సర్టిఫైడ్‌, శిక్షణ పొందిన కుక్‌లను మాత్రమే నియమించే విషయంపై తక్షణమే కార్యాచరణ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -