ఫిడెల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా నిర్వహణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ :
కమ్యూనిస్టు దిగ్గజం, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా భారత్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆరు దశాబ్దాల పాటు తీవ్ర ఆర్థిక ఆంక్షలు కొనసాగినా క్యూబాను విద్య, వైద్యం, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో అగ్రగామిగా నడిపించటంతో పాటు ఈ సదుపాయాలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా చేసిన ఘనత ఫిడెల్ కాస్ట్రో సొంతం. బేస్‌బాల్, బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో క్యూబా అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు అందుకుంది. క్రీడలకు కాస్ట్రో సేవలు, సాకర్ లెజెండ్ డీగో మారడోనాతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆగస్టు 2-3, 9-10న న్యూఢిల్లీలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ‘ది నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా’ వెల్లడించింది. భారత ఫుట్‌బాల్ స్టార్స్ ఈ టోర్నమెంట్‌లో భాగమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నారని సంఘీభావ కమిటీ తెలిపింది. ఈ పోటీల్లో ఆడాలనుకునే జట్లు ఈనెల 24లోగా 9650982691, 9953485424 నెంబర్లను సంప్రదించగలరు.
క్యూబాకు సంఘీభావంగా ఫుట్‌బాల్ టోర్నీ
- Advertisement -
- Advertisement -