నేడు ప్రేరేపిస్తూ చైతన్యం చేయడం…
నేను సైతం విద్యాభివృద్ధికి చేయూత…
– ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
రేపటి పౌరుల ఉజ్వల భవిష్యత్తు కోసం నేను సైతం విద్యాభివృద్ధి చేయూత అనే కార్యక్రమంతో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు, భవిష్యత్తు పట్ల స్పష్టమైన దిశా నిర్దేశం చూపించేందుకు ప్రేరేపించు – మండించు( ‘ఇన్స్పైర్ & ఇగ్నైట్’) అనే కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.

గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం ఆద్వర్యంలో ఎమ్మెల్యే జారె చొరవతో, ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశానుసారం హైదరాబాదు కు చెందిన ‘ఇన్స్పైర్ & ఇగ్నైట్’ అనే వ్యక్తిత్వ వికాసం సంస్థ ద్వారా గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్ధిని విద్యార్ధులకు నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాసం – మనోవైజ్ఞానిక తరగతులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాల వరకే పరిమితం కాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు మనో చైతన్యం కలిగించాలనే తపనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు.
ఇన్స్పైర్ మైండ్స్ – ఇగ్నైటింగ్ సోల్స్ బృంద సభ్యులు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, లక్ష్యసాధన,భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలపై చక్కని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి, సహకారం అందించిన సంస్థ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఐటీడీఏ పీఓ బి.రాహుల్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిధానం అనుగుణంగా భవిష్యత్ లో పాఠ్య ప్రణాళికను లు ఉంటాయని వాటికి అనుసంధానంగా విద్యాబోధన, విద్యార్ధి వ్యక్తిత్వ వికాసం నెలకొల్పుతామని అన్నారు.

మొదటి రోజు అశ్వారావుపేటలోని ముస్లిం మైనారిటీ బాలికల పాఠశాల, ఏజీహెచ్ఎస్ బాలికల పాఠశాల, మద్దికొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏటీడబ్ల్యుఓ చంద్రమోహన్, ఎంఈఓ ప్రసాదరావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సునీత, పద్మావతి, భావ్ సింగ్ లు, ఇన్స్పైర్ & ఇగ్నైట్ సంస్థ డైరెక్టర్స్ డి.రంజిత్, యూ.రామ్, డి.సుధాకర్, నవీన్, ఖాసీంలు పాల్గొన్నారు.