Tuesday, November 4, 2025
E-PAPER
Homeసినిమా'అఖండ 2' కోసం..

‘అఖండ 2’ కోసం..

- Advertisement -

పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదరులు సంస్కత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ ప్రతిభావంతులైన సోదరులు ‘అఖండ 2’తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

సంగీత దర్శకుడు తమన్‌ తాజాగా ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రారంభించారు. ఈ సినిమాతో మిశ్రా బ్రదర్స్‌ను ఆయన పరిచయం చేయబోతున్నారు. ఆయన అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో వీరు సంస్కత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెట్టి ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి కెమెరా : సి.రామ్‌ప్రసాద్‌, సంతోష్‌ డి డిటాకే, సంగీతం: తమన్‌, నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -