Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅప్పు తిరిగివ్వమని అడిగినందుకు..

అప్పు తిరిగివ్వమని అడిగినందుకు..

- Advertisement -

– కక్షతో మహిళను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
నవతెలంగాణ-శంషాబాద్‌

అప్పుగా ఇచ్చిన డబ్బుల విషయంలో జరిగిన గొడవతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి మహిళను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంతో కిడ్నాప్‌ కథ బయటపడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన కమ్మెట విజరుకుమార్‌ అదే గ్రామానికి చెందిన కొండకళ్ల పద్మజ (28) దగ్గర రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇచ్చే సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఆ రోజు నుంచి విజరుగౌడ్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె భర్త బుచ్చయ్య మానసికంగా అస్వస్థతకు గురయ్యాడు. అతను వారం నుంచి శంషాబాద్‌ మండలం మల్కారం గ్రామ పరిధిలోని ఆశాజ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత మంగళవారం మధ్యాహ్నం పద్మజ తన భర్తకు బట్టలు ఇవ్వడానికి ఆస్పత్రికి వచ్చింది. అనంతరం పండ్లు తీసుకురావడానికి బయటకు వచ్చింది. అదే సమయంలో విజరుగౌడ్‌ తన అనుచరులు వెంకటేష్‌, సాయితో కలిసి ఎర్టిగా కారులో ఆస్పత్రి గేటు వద్దకు వచ్చాడు. పద్మజను బలవంతంగా కారులోకి లాక్కెళ్లారు. ఆ సమయంలో విజరుగౌడ్‌ కారు నడుపుతున్నాడు. ఆమెను కొట్టి, తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. కారు కొత్వాల్‌గూడ గ్రామ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డు వద్దకు రాగానే ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ.. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న విజరుగౌడ్‌ను లాగింది. కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో పద్మజతోపాటు కారులో ఉన్న కిడ్నాపర్లకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శంషాబాద్‌లోని అర్కాన్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img