Wednesday, December 24, 2025
E-PAPER
Homeమానవిమానసిక ఆరోగ్యం కోసం…

మానసిక ఆరోగ్యం కోసం…

- Advertisement -

సోషల్‌ మీడియా ప్రభావంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది రోజులో ఎక్కువ గంటలు సోషల్‌ మీడియాలోనే గడుపుతున్నారు. దీంతో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. సోషల్‌ మీడియాను ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

-సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటే.. మీరనుకున్న లక్ష్యానికి చేరవవుతారు. ఏకాగ్రతతో, క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నిస్తారు.
-ఒత్తిడికి దూరమవుతారు. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
-సమాచారం తెలుసుకోవడానికి సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలి. కానీ రోజులో ఎంతసేపు సోషల్‌ మీడియాని ఉపయోగించుకోవాలో పక్కా ప్రణాళిక మేరకు అమలు చేసుకుంటే మంచిది.
-సోషల్‌ మీడియాకు బదులుగా.. పుస్తకాలు చదవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటి అలవాటు చేసుకుంటే మంచిది.
-ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోయేముందు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. లేకపోతే నిద్ర సరిగ్గా లేక పలు అనారోగ్య సమస్యలకు గురవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -