Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రచారంలో ప్రశాంతత కోసం...

ప్రచారంలో ప్రశాంతత కోసం…

- Advertisement -

గట్టు కాడిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే 
నవతెలంగాణ – వనపర్తి 

సర్పంచి ఎన్నికల్లో భాగంగా గ్రామాలన్నీ తిరుగుతూ బిజీగా ప్రచారం నిర్వహిస్తున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గట్టు కాడిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కాస్త ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం ఘనపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను వార్డు సభ్యులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గట్టు కాడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జ్యోతి రాములు కు మద్దతుగా ప్రచారం నిర్వహించి అనంతరం ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శక్తివంతమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, డాక్టర్ పగడాల శ్రీనివాసులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -