తొలుత సర్పంచ్ ఎన్నికలపై గురి
ఓడినా ‘పరిషత్’ ఉందనే ధీమా
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్పంచ్ ఎన్నికలను తొలుత నిర్వ హించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వాటి రిజర్వేషన్లు సైతం ఖరారు చేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఆశావాహులకు ప్రభుత్వం నిర్ణయం మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఓటమి పాలైనా..త్వరలోనే నిర్వహించనున్న పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల తరపున మరోమారు పోటీ చేయచ్చనే ఉద్దేశంతో పల్లెపో రుకు జై కొడుతున్నారు. షెడ్యూల్ సైతం ప్రకటించడంతో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నా లు ముమ్మరం చేశారు.మండలంలో 15 సర్పంచ్ లు,128 వార్డులున్నాయి.
ఆశపడి.. నిరాశకు గురై..
రాజకీయ పార్టీల పరంగా జరిగే పరిషత్ ఎన్నిక లను మొదట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ దిశగా నోటిఫికేషన్ సైతం సెప్టెంబర్లో విడుదల చేసింది.ఎంపీటీసీ, జెడ్పీ టీసీగా పోటీ చేయాలని భావించిన ఆశావహులు అందుకు సన్నద్ధమయ్యారు. ప్రధాన పార్టీల తర పున టికెట్లను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపును కోర్టు సమర్థించకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో వారు నిరాశ చెందారు. తాజాగా పరిషత్ కు బదులు తొలుత పంచాయతీ ఎన్నిక లకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఖరారు చేస్తు గెజిట్ కూడా ప్రకటించింది.
బీసీల్లో ఆవేదన..
అక్టోబర్లో 42శాతం రిజర్వేషన్లను ప్రకటించడం తో బీసీ స్థానాలు భారీగా పెరిగాయి. రిజర్వేషన్ కలిసిరావడంతో ఆయా కులస్తులు పోటీకి సిద్ద మయ్యారు. తాజాగా ఆ స్థానాలు తగ్గించి ఖరారు చేయడంతో ఆయా కులాలకు సంబం ధించి ఆశావహుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోం ది. నిన్నమొన్నటి వరకు పోటీకి ఉత్సాహం చూపిన వారి అంచనాలు ఒక్కసారిగా తారుమా రయ్యాయి. కొత్త రిజర్వేషన్లతో పోటీకి అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
సర్పంచ్ గా ఓడినా..పరిషత్ ధీమా
గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కించుకునేం దుకు రాజకీయ పార్టీల్లోని చోటామోటా నాయ కులు ఆశపడుతుంటారు. పార్టీయేతర ఎన్నికలు అయినప్పటికీ పార్టీల మద్దతు ఉంటే గెలుపు సునాయాసమవుతుందని భావిస్తుంటారు. పరిషత్ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండటంతో ఆ ఎన్నికల్లో పార్టీల గుర్తుపై పోటీ చేసి ఓడి పోతే సర్పంచ్ గా మళ్లీ అవకాశం దక్కే పరిస్థితి ఉండదు. దీంతో పంచాయతీ పోరు అలాంటి అభ్యర్థులకు మంచి ఆప్షన్ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతు న్నారు. గెలిస్తే సర్పంచ్ గా గ్రామంలో పెత్తనం చేసే అవకాశం లభిస్తోంది. ఒకవేళ ఓడిపోతే పరిషత్ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించు కోవచ్చని భావిస్తున్నారు.



