- Advertisement -
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా మిత్ర దేశాలకు సవాలు విసిరిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దానిని బలవంతంగా తెరవడానికి సైనిక చర్య చేపట్టడం అవాస్తవికమని అన్నారు. ”సైనిక చర్య ద్వారా హార్ముజ్ జలసంధిని బలవంతంగా విడిపించాలనే ఆలోచనను కొందరు సమర్థిస్తున్నారు. ఈ వైఖరిని అమెరికా కూడా అప్పుడప్పుడు వ్యక్తం చేస్తోంది. అయితే అది మారుతూ వచ్చింది” అని దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా మ్యాక్రాన్ విలేకరులతో అన్నారు.
- Advertisement -



