నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల ఆవరణలో గురువారం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కోరారు.
ప్రజలు తమ ఇంటి ఆవరణలో నాటుకునేందుకు అవసరమైన పండ్ల మొక్కల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పండ్ల మొక్కల అవసరమైన ప్రజలు గ్రామ పంచాయతీలో సంప్రదించాలని ఆయన సూచించారు. గ్రామంలో వనమహోత్సవం విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరు తమ వంతుగా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కొమ్ముల రవీందర్, అవారి సత్యనారాయణ, బోనగిరి లక్ష్మణ్, బోనగిరి భాస్కర్, మారుపాక నరేష్, సాదుల్లా, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమికోన్నత పాఠశాలలో వనమహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES