- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని పల్లె ప్రకృతి వనంలో క్షేత్ర సహాయకులకు, గ్రామ కార్యదర్శులకు క్షేత్రస్థాయిలో మొక్కల పెంపకం పై ఫారెస్ట్ అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో క్షేత్ర సహాయకుల సమక్షంలో నర్సరీల పెంపకం పై వారు అవగాహన కల్పించారు. మొక్కల పెరుగుదలకు చేపట్టే పద్ధతుల గురించి వారికి క్షేత్రస్థాయిలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి కుతుబుద్దీన్, గంగారెడ్డి, ఏపీ ఓ రమణ, సాంకేతిక సహాయకులు దేవి సింగ్, రాజేశ్వర్, గ్రామ కార్యదర్శులు రాజేందర్ రావ్, నవీన్, వెంకటరమణ, ఆయిలు, క్షేత్ర సహాయకులు గోపి, నారాయణ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -