Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేటుగాళ్ల చేతిలో మోసపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య

కేటుగాళ్ల చేతిలో మోసపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.2.58 కోట్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాల ఆశ చూపి, వాట్సాప్ ద్వారా సంప్రదించిన ముఠా, నకిలీ ట్రేడింగ్ టిప్స్, తప్పుడు స్క్రీన్ షాట్లతో ఆమెను నమ్మించి పెట్టుబడులు పెట్టించింది. లాభాలు చూపించినా, డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -