Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు..

ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నియోజకవర్గ నాయకులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు అందించిన సంక్షేమ, అభివృద్ధి పనులను, సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో.. నేడు ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చేందుకు క్యాంపు కార్యాలయానికి తరలి వస్తున్నారు. అక్కడికి విచ్చేసిన ప్రజల నుండి ధరఖాస్తులు తీసుకొని వారి సమస్యలు వింటూ.. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేస్తూ సాధ్యమైనంతవరకు వారి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే దిశగా కృషి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -