- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
- Advertisement -



