Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకేరళ మాజీ సీఎం వి.ఎస్‌.అచ్యుతానందన్‌కు అస్వ‌స్థ‌త‌

కేరళ మాజీ సీఎం వి.ఎస్‌.అచ్యుతానందన్‌కు అస్వ‌స్థ‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రముఖ సీపీఐ(యం) నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ ఆస్పత్రిలో చేరారు. గుండెపోటుతో సోమవారం ఉదయం పదిగంటలకు తిరువనంతపురంలోని పట్టోమ్‌లో ఎస్‌యుటి ఆస్పత్రిలో చేరారు. ఐసియులో ఉన్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. గతేడాది అక్టోబర్‌ 20న ఆయన 101వ పడిలోకి అడుగుపెట్టారు. కేరళ రాజకీయాల్లో అచ్యుతానందన్‌ ఒక మహోన్నతమైన చురుకైన పాత్ర పోషించారు. అచ్యుతానందన్‌ 1923లో అలప్పుజలోని పునప్పరలో వ్యవసాయకార్మికుల కుటుంబంలో జన్మించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img