Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : జుక్కల్ మండలంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు సతీష్ పటేల్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనగ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొని వస్తున్న క్రమంలో రైతులు ముఖ్యంగా తేమ 14% ఉండాలి. అదే విధంగా ప్రభుత్వ మద్దతు ధర రూ” 5,875/-  ఉందని తెలిపారు. మండలంలోని రైతులు దళారులకు నమ్మవద్దని వారంతా తూకంలో, ధరలో మోసాలకు పాల్పడతారని తెలిపారు. దళారుల నుండి కాపాడేందుకు ప్రభుత్వం జుక్కల్ మండలంలో కొనుగోలు కేంద్రాన్ని  దోస్పల్లి రోడ్డు వద్ద నిర్మించిన సబ్ మార్కెట్ కమిటీ గోదాముల వద్ద తూకం వేసేందుకు నిర్ణయించామని అధికారులు చెప్తుంటే క్షేత్రస్థాయిలో ఇంకో రకంగా ఉందని రైతులు వాపోయారు. ముఖ్యంగా ప్రస్తుతం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్  జుక్కల్ మండల వాసి పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన చైర్మన్ సౌజన్య రమేష్ పదవిలో ఉన్నప్పటికీ మండల రైతులకు నేటికీ ఒరిగింది ఏమీ లేదని రైతులు విమర్శిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ, జుక్కల్ సర్పంచ్ కర్రీ వార్ సావిత్ర,  కామారెడ్డి  జిల్లా  కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీ రాజు పటేల్ , జనరల్ సెక్రెటరీ ఇమ్రాన్ ఖాన్,  మాజీ సొసైటీ చైర్మన్ శివానంద్, కాంగ్రెస్ నాయకులు జాదవ్ బాబు పటేల్, సురేష్ గొండ, రమేష్ దేశాయ్, అనిల్ సెట్, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -