నవతెలంగాణ – రెంజల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెంజల్ మండలంలో ముంపుకు గురైన రైతుల పంట పొలాలను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. మండలంలో 5323 ఎకరాలలో సోయపంట, 4312 ఎకరాలలో వరి పంట నీట మునిగిందని అధికారులు అంచనాలు వేసి ఆయనకు నివేదికను అందించారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకుంటుందని, ఆయన స్పష్టం చేశారు. గత రెండు మూడు రోజులుగా ముంపుకు గురి అయిన పంటలతో పాటు, రైతుల ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయని, వాటిని విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టి రైతులకు సహకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అమ్దాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మేహతో, మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్, రెంజల్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, స్థానిక నాయకులు జావిద్, సిహెచ్ రాములు, ధనుజయ్, మోహన్, ఆగంటి సురేందర్ గౌడ్, లచ్చే వార్ నితిన్, సాయిబాబా గడ్, అంజయ్య, సాయా గౌడ్, పురం నరసయ్య, వి. శంకర్, సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, యోగేష్, భూమా రెడ్డి, సిద్ధ సాయిలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
వరదల్లో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES