Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

ఘనంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలో ఘనంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో కేక్ కట్ చేయడంతో పాటు విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం పుస్తకాలను అందజేసి గ్రంథాలయానికి వేరే ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని ప్రత్యేక అధికారి శ్యామలకు సూచించారు. అనంతరం సాటా పూర్ చౌరస్తాలో సీనియర్ నాయకులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ సామియా గార్డెన్ లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మాజీ మండల అధ్యక్షులు జి.సాయిరెడ్డి, సిహెచ్ రాములు, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, సీనియర్ నాయకులు జావిద్ ఉద్దీన్, ధనుంజయ్, సాయిబాబాగౌడ్, కురుమే శ్రీనివాస్, వై శంకర్, కుద్దూస్, ఇందిర దేవి, మాజీ ఎంపీటీసీ కవిత, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎల్ రాజు, గంగా కృష్ణ, గియాసోద్దీన్, ఓ మోహన్, గోసుల శ్రీనివాస్, కార్తీక్ యాదవ్, గైని కిరణ్, సిద్ధ సాయిలు, షౌకత్ అలీ, కృష్ణ, వినోద్, గైని సాయిలు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -