అనారోగ్యంతో తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ శ్రేణుల నివాళి
సీఎం రేవంత్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రముఖుల సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. తన బావతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే కేసీఆర్ హరీశ్‌రావుకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ పార్థివ దేహాన్ని అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులు, ఇతర ప్రముఖుల సందర్శనార్థం హైదరాబాద్ కోకాపేటలోని క్రిన్స్‌విల్లాస్‌లో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీశ్‌రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ ఈటల రాజేందర్, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ రావు మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, పలువురు బీఆర్‌ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మాజీమంత్రి హరీశ్‌రావుకు పితృ వియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



