- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కొమ్ము నరసింహ అనారోగ్య కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, డి ఎస్ బి సి యు డైరెక్టర్ నాగేంద్ర యాదవ్, గ్రామ ప్రెసిడెంట్ నరేష్, బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సరోజ,నాయకులు, శ్రీనివాస్ యాదవ్, కొమ్ము నిరంజన్, మూడావత్ శంకర్, కురుమూర్తి,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



