Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనిల్ ను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే 

అనిల్ ను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే 

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ ను మహబూబాద్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆశీర్వదించారు. ఎర్రబెల్లి గూడెం ఎంపీటీసీ బత్తిని అనిల్ గౌడ్ జన్మదిన వేడుకల పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకునే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని నీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాబోయే ప్రజాప్రతినిధులుగా ముందుకు సాగేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అనిల్ ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఆ గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి జన్మదిన జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు అని అనిల్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -