Monday, November 17, 2025
E-PAPER
Homeవరంగల్బొల్లె బిక్షపతిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

బొల్లె బిక్షపతిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-పరకాల: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ జడ్పిటిసి బొల్లె బిక్షపతిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులను కలిసి బిక్షపతి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరినట్టు తెలిపారు. అలాగే బిక్షపతి కుటుంబానికి తన వంతు అండగా ఉంటామని ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. పరామర్శలో ఆయన వెంట నడికూడ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దురిశెట్టి చందు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -