నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో మూడో విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసముంటున్న అన్నపూర్ణమ్మ తన సొంత గ్రామమైన చౌట్ పల్లికి తన కుమారుడు, బిజెపి బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున రెడ్డితో కలిసి విచ్చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ జరుగుతున్న తీరును స్థానిక బిజెపి నాయకులను ఆమె అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత గ్రామానికి విచ్చేసి ఓటు వేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ, గ్రామానికి సేవ చేసే వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



