నవతెలంగాణ – అచ్చంపేట : కడ్తాల్ మండల కేంద్రం మైసిగండి ఆలయంలో సోమవారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అధ్యక్షులు గువ్వల బాలరాజ్ జన్మదిన వేడుకలు అచ్చంపేట భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రాజు నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని అలమాస్గూడ క్రికెట్ స్టేడియంలో కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు పండ్లను అందజేశారు. అచ్చంపేట నియోజకవర్గం నుండి గువ్వల బాలరాజు అభిమానులు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, అచ్చంపేట మాజీ మున్సిపాలిటీ చైర్మన్ నరసింహ గౌడ్, బిఆర్ఎస్ కర్తాల్ టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ, నాయకులు, నరసింహ, లాయక్ అలీ, అంజి ,మహేష్, శ్రీకాంత్, వెంకటేష్, సురేష్ ముబిన్ ,శివ కమల్ రాజ్ ,రమేష్, రాజేష్ కుంభం ప్రవీణ్ గౌడ్ ,వేముల రాజేశ్వరరావు, జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.