Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ లోని కాశి గుండాన్ని దర్శించిన మాజీ ఎమ్మెల్యే

కౌలాస్ లోని కాశి గుండాన్ని దర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కౌలాస్ గ్రామంలోని శివారులో పూర్వం వందల ఏళ క్రితం నిర్మించిన కాశీ గుండం శివాలయాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అనితా సింగ్ , శంకర్ పటేల్ తొ కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  శ్రావణమాసం ప్రారంభంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే పలు దేవాలయాలను సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే కౌలాస్ గ్రామంలో అతి పురాతనమైన ఈ కాశీగుండం శివాలయం వందల ఏళ్ల నాటిది కావడం విశేషం.

ఇక్కడ దర్శించుకున్న వారు కాశీకి వెళ్లి ఆ శివుని దర్శించుకున్నంత ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. శ్రావణమాసం వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాల శివ భక్తులు తండోపతండలుగా ఈ గుడికి రావడం శివున్ని దర్శించుకోవడం జరుగుతుంది. శివాలయం ముఖ్య అర్చకులు జోషి మాజీ ఎమ్మెల్యే ను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు కౌలాస్ కోట రాజ వంశిస్తురాలు రాణి అనితా సింగ్ , శంకర్ పటేల్,  విట్టు పటేల్ , వాస్రే రమేష్ , హనుమా గౌడ్ , విశ్వనాథ్ జోషి , సాయిలు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -