Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ..
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద బుధువారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ముందుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మన్ గొనె కళ్యాణ్ విజయ్ కుమార్ లతో పాటు కార్యకర్తలు  కేక్ కట్ చేసి ఒక్కరికి ఒక్కర. స్వీట్ పంచి తినిపించుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ అస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే జన్మదిన సందర్బంగా రోగులకు పండ్లు పంచిపెట్టారు.

అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మండల నాయకులు మాట్లాడుతూ ముధోల్ నియోజక వర్గంలో పది సంవత్సరాల నుండి ఎమ్మెల్యే గా పని చేసి పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకొని వారి మన్ననలు పొందిన ఘనత విఠల్ రెడ్డి ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ గొనె కళ్యాణ్ మాజీ జడ్పీటీసీ శంకర్ చావన్ విజయ్ కుమార్ సూది రాజన్న నాగలింగం నర్సారెడ్డి రఫీక్ సేట్ దేవేందర్ సంతోష్ జావీద్ ఖాన్ తో పాటు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -