నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం మాజీ ఎంపీపీ బీజేపీ సీనియర్ నాయకులు శెట్కార్ బస్వంత్ రావు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో జుక్కల్ బి ఆర్ యస్ పార్టీ ఆఫిస్ లో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన బస్వంతరావు పటేల్ మాజీ ఎంపీపీగా ఐదేండ్లు పదవిలో కొనసాగారు. తధానంతరం బీఆర్ఎస్ పార్టీని విడిచి బిజెపిలో చేరిపోయారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం బీ ఆర్ ఎస్ చేరడంతో వీరశైవ లింగాయత్ ఓటర్లు సంఖ్య భారీగా గెలుపే అవకాశాలపై పడే అవకాశం ఉందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పని చేసిన అనుభవం ఉండడంతో మాజీ ఎంపీపీ పార్టీలో చేరడం వలన పార్టీ పట్టిష్టత ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మండలానికి సంబంధించిన సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



