Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విజయమే లక్ష్యంగా మాజీ ఎంపీపీల విస్తృత ప్రచారం 

విజయమే లక్ష్యంగా మాజీ ఎంపీపీల విస్తృత ప్రచారం 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
పసర గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో బి ఆర్ ఎస్ అభ్యర్థి లాకవత్ మమత చందులాల్ విజయమే లక్ష్యంగా మాజీ ఎంపీపీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం పసర గ్రామంలో మాజీ ఎంపీపీలు బి ఆర్ ఎస్ సూడి శ్రీనివాసరెడ్డి  మరియు బిజెపి మద్దినేని తేజరాజులు  లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేయాలంటే పోటీలు పడి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతు రుణమాఫీ ఫెయిల్ అయిందని, సన్న ధాన్యం బోనస్ గత రబీ నుంచి ఇప్పటివరకు వర్తించలేదని, హామీలన్నీ గంగలో కలిశాయని, కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట ముంచుతుందని అన్నారు.

పసల గ్రామపంచాయతీకి ప్రభుత్వ పరంగా రావలసిన నిధులను చట్టబద్ధంగా రాబట్టి అభివృద్ధి సాధిస్తామని అన్నారు. మరో రెండేళ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుందని అప్పుడు అభివృద్ధి మామూలుగా ఉండదని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో పసర పంచాయితీ పూర్తిగా ఆబాసపాలైందని సొంత పార్టీ సర్పంచిని బహిష్కరించే పరిస్థితి దాపురించిందని అన్నారు. దీనితో అభివృద్ధి పూర్తిగా కుంటూ పడిపోయిందని అలాంటి పరిస్థితి పసర పంచాయతీలో మళ్ళ  రావద్దని అభివృద్ధి కోసం మమతా చందులాల్ ను గెలిపించాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -