- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని పుప్పాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ లు మాజీమంత్రి మాండవ వెంకటేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల మాజీ సర్పంచ్ అంకం ప్రకాష్ ,మాజీ ఎంపీటీసీ అంకం లక్ష్మి దంపతుల కూతురు పెళ్లి నిర్వహించారు. పెండ్లి వేడుకలకు మాజీ మంత్రి హాజరు కాకపోవడంతో శనివారం పుప్పాలపల్లి గ్రామానికి వచ్చి నూతన దంపతులను దీవించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ దంపతులు మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట జక్రాన్ పల్లి మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి, వేల్పూర్ మాజీ ఎంపీపీ మోతె రామా గౌడ్, పుప్పాలపల్లి నాయకులు రమణారెడ్డి, సంతోష్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



