నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
పవిత్రమైన కార్తీకమాసంలో శివ మాలలు ధరించిన శివస్వాములు భక్తి శ్రద్దలతో శివునికి పూజలు చేస్తారు. 41 రోజులు మండల దీక్ష చేస్తున్న స్వాములకు నిత్య అన్నప్రసాదాలు వితరణ చేస్తారు. కల్వకుర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురు స్వామి కార్వంగ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో శివ మాలలు ధరించిన శివ స్వాములకు మండల దీక్ష కాలం నిత్య అన్నదానం కార్యక్రమం చేపట్టారు. అన్నదానంలో భాగంగా శనివారం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారిని స్వాములు అన్నదాత సుఖీభవ అంటూ దీవించారు. అన్నదానం చేసే భక్తులు గురు స్వామి ఆనంద్ గౌడ్ ను సంప్రదించాలని తెలిపారు.
అన్నప్రసాదం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, ఆరోగ్య పరంగా మంచి జరుగుతుందని గురు స్వామి ఆనంద్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షాహేద్,గురు స్వాములు ఆంజనేయులు, వెంకటయ్య, రాజు,బాలరాజు,జంగయ్య మరియు శివ స్వాములు, హనుమాన్ స్వాములు, అమ్మవారి స్వాములు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వాములకు అన్నప్రసాదం పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



