- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ ని మంగళవారం కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కామారెడ్డి లో కాంగ్రెస్ బలో పేతానికి కృషిచేయాలని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పొన్నం ప్రభాకర్ సూచించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో, కామారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్లు, బంపర్ లతా శ్రీనివాస్, చాట్ల వంశీకృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, తాయాబ సుల్తానా సలీం,రంగ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -