Wednesday, January 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‘చూపుపోయే ప్రమాదం’

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‘చూపుపోయే ప్రమాదం’

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానిక మీడియా కథనాల మేరకు.. ఇమ్రాన్‌ ఖాన్‌ కుడి కంటిలో సమస్య తలెత్తిందని, దానికి వెంటనే చికిత్స అందించకపోతే చూపుపోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని డిమాండ్‌ చేశాయి. వైద్యుల సూచనను పట్టించుకోకుండా జైల్లోనే ఆయనకు చికిత్స అందించాలని జైలు అధికారులు పట్టుబడుతున్నారని ఆరోపించాయి. 2024 అక్టోబర్‌ లో ఇమ్రాన్‌ తన వ్యక్తిగత వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకున్నారని, ఆ తర్వాత నుంచి ఆ డాక్టర్‌ ను కలిసేందుకు అనుమతించడం లేదని పీటీఐ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -