– పది సంవత్సరాల అనుభవంతో పని చస్తానని హామీ
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ తన అనుభవంతో గ్రామాన్నీ అభివృద్ధి చేస్తానని ఇంటింటా తిరుగుతూ మంగళవారం ముగింపు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఐదు సంవత్సరాలు తన సతీమణి ఐదు సంవత్సరాలు జనగామ గ్రామానికి ఎన లేని సేవలు అందించామని ఆ విషయం జనగామ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసని ఆ అనుభవంతోనే మీకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రస్తుతం సర్పంచిగా పోటీ చేస్తున్నానని మూడో వరుస క్రమంలో ఉన్న బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఇంటింటా తిరుగుతూ ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో బిబిపేట మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, బోదాస్ సాయికుమార్, డి లింగం, రాజేందర్, అబ్బాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జనగామలో మాజీ సర్పంచ్ జోరుగా ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



