- Advertisement -
- సిమెంటుతో గుంతలకు మరమ్మతులు
- నవతెలంగాణ – బెజ్జంకి
- మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి గ్రంథాలయ వైపు వెళ్లే రోడ్డు గుంతలమయమై ప్రమాదకరంగా మారింది. పలువురు గ్రామస్తులు రోడ్డు ప్రమాదం బారిన సందర్భాలున్నాయి. సోమవారం మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య తన స్వంత ఖర్చులతో గుంతలమయమైన రోడ్డుకు సిమెంటుతో మరమ్మతులు చేపట్టారు. మాజీ సర్పంచ్ చూపుతున్న మానవత దృక్పథంపై పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గత నెల 20న బేగంపేట రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలను పలువురి దాతల సహాకారంతో మాజీ సర్పంచ్ మట్టితో పూడ్చారు.
- Advertisement -