
నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కాలేజీ (జీజేసీ) పాఠశాల పూర్వ విద్యార్థులు రీయూనియన్ వేడుకలను జాలీ.. జాలీగా జరుపుకున్నారు. పాఠశాలలో 2005-06 విద్యాసంవత్సంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలలో చదువుకుని.. జీవితంలో స్థిరపడిన ఇన్నాళ్లకు మళ్లీ కలుసుకున్నారు.
20 ఏండ్ల తరువాత మళ్లీ ఒక్కచోట కలుసుని సంతోషాలు పంచుకున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా అప్పట్లో చదువు నేర్పిన గురువులు బస్వరాజ్, మాధవి, శ్రీదేవి, అంజద్, రాములు, మహంతయ్య, నారాయణలను శాలువాలతో సత్కరించి.. మెమెంటోలను అందజేశారు. మరోవైపు విద్యార్థులంతా అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుని అంతులేనంత సంతోషంగా గడిపారు.



