Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ కల్మాడి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ కల్మాడి కన్నుమూత

- Advertisement -

ఫూణే : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సురేశ్‌ కల్మాడి (81) మంగళవారం కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనా రోగ్య సమస్యలతో బాధపడుతున్న కల్మాడి మంగళ వారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పూణేలోని దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు చెప్పారు. కల్మాడి కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఎ) అధ్యక్షులుగానూ పనిచేశారు. పూణే స్థానం నుంచి లోక్‌సభకు అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. కల్మాడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూణే నవీ పేటలోని వైకుంఠ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో కల్మాడికి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు ఆయన కార్యాలయం వెల్లడించింది.
కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా సుదీర్ఘకాలం ….
కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా కల్మాడీ సుదీర్ఘ కాలం కొనసాగారు. 1995-96 మధ్య కాలంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లోకి ప్రవేశించకముందు ఆయన భారత వైమానిక దళంలో (ఐఏఎఫ్‌) పైలట్‌గా 1964 నుండి 1972 వరకు పనిచేశారు. క్రీడా రంగంలో భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) అధ్యక్షునిగా దేశీయ క్రీడా రంగంలో కీలక పాత్ర పోషించారు. అయితే 2010లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణలో నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు కల్మాడీ రాజకీయ జీవితానికి మచ్చతెచ్చాయి. ఈ కేసులో 2011లో ఆయన అరెస్ట్‌ కావడంతో కాంగ్రెస్‌ ఆయనను సస్పెండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -