– యువత చైతన్యానికి కృషి
– గాండ్లగూడెం కాంగ్రెస్ అభ్యర్ధి గొమలోత్ ఆలీ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాజకీయాలలో అనుకూల ప్రతికూలతలు లు ప్రజాభిప్రాయాన్ని బట్టి మారుతుంటాయి. ప్రజాభీష్టం ఎలా ఉన్నా నాయకుల వ్యక్తిత్వం ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం మే గెలుపు ఓటములు నిర్ణయిస్తుంది. అందుకేనేమో ఒకసారి ఘోరంగా ఓడిన వారే మరో సారి గెలుస్తారు. విజయానికి అపజయం నాంది అనే క్రీడా స్పూర్తి.ఈ స్పూర్తి తోనే కొందరు ప్రస్తుతం ఎన్నికల బరిలో దిగారు. అలాంటి జంటే మండలంలోని గాండ్లగూడెం పంచాయితి సర్పంచ్ అభ్యర్ధులు గా నాడు భార్య సునీత పోటీ పడగా,నేడు భర్త మలోత్ ఆలి బాబు పోటీ పడుతున్నారు.
గతంలో భార్య సునీత ప్రత్యర్ధి పై ఓడిన సానుభూతి తో నేడు భర్త ఆలి బాబు కు విజయం చేరువయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఉంది. ఈ సందర్భంగా సోమవారం ఆలి బాబు నవతెలంగాణ తో మాట్లాడుతూ పంచాయితి పరిధిలో యువత చైతన్యం కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తానని,వీధులు అన్నీ సీసీ రోడ్లు,మురుగు కాలువలు అన్నీ డ్రైనేజీ నిర్మాణాలు,వ్యవసాయ క్షేత్రాలకు కచ్చా రోడ్లు నిర్మిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహాకారంతో,జూపల్లి రమేష్ ప్రోత్సాహంతో రాజకీయాలకు అతీతంగా పంచాయితీ సమగ్ర అభివృద్ధి చేస్తామని అన్నారు.



