Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులతో పాఠశాల తనిఖీ బృందాల ఏర్పాటు సరైంది కాదు

ఉపాధ్యాయులతో పాఠశాల తనిఖీ బృందాల ఏర్పాటు సరైంది కాదు

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య.
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భువనగిరి మండలం సభ్యత నమోదు కార్యక్రమం భువనగిరి మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులచే ఏర్పాటు చేయబడు పాఠశాలల తనిఖీ  బృందాలు సరైంది కాదని, అనేక మంది ఉపాధ్యాయులను విద్యాబోధనకు  దూరం చేయడమే అవుతుందని, అందుకే ఈ ప్రక్రియను ఉపసంహరించుకోవాలన్నారు. పాఠశాలల తనిఖీ,పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో  ఎంఈఓ -1, ఎంఈఓ -2 పోస్టులను మంజూరి చేయాలనీ,, డిప్యూటీ ఇవో, డీఈవో పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జివి రమణారావు, అధ్యక్షులు పి సుదర్శన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి రవీందర్, మల్లేశం,ఆశాలత, వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -