– అదుపులోకి తీసుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు
నవతెలంగాణ- జవహర్‌నగర్
ఆన్‌లైన్‌లో గుర్రపు పందెల బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. దమ్మాయిగూడలోని తిరుమల ఎన్‌క్లేవ్ ఫేజ్-2 కాలనీలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వాట్సాప్ గ్రూపుల ద్వారా హార్స్ రేస్ బెట్టింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వారి నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ.2 లక్షల నగదు, మరో రూ.2.47 లక్షలు యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్నట్టు గుర్తించారు. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. అరెస్టు అయిన వారిలో తోకల నగేశ్, బొర్ర వెంకయ్యచౌదరి, చల్లా రమేష్‌బాబు, డి. సునీల్ ఉన్నారు. ఎం. రాజేశ్ కుమార్, వెంకట్ చౌదరి పరారీలో ఉన్నారు.
గుర్రపు పందెం బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES