నవతెలంగాణ – మల్హర్ రావు
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 33 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక కాగా మల్హర్ మండలంలోని తాడిచెర్ల జిల్లా పరిషత్ హైస్కూలు నుంచి సిహెచ్.సరస్వతి, దుబ్బపేటలోని కస్తూరిబాయి(కెజిబివి) ఆశ్రమ పాఠశాల నుంచి ఏ.సుజాత,ఎడ్లపల్లి గ్రామంలోని ప్రాథమిక ప్రాథమిక పాఠశాల నుంచి డి.సంధ్యారాణి, ఆన్ సాన్ పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల నుంచి బి.అజయ్ కుమార్ నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరికి కలెక్టర్ రాహుల్ శర్మ,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,డిఈఓ రాజేందర్, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబులచే ప్రశంస పత్రం, మేమేంటో,శాలువాలతో ఘనంగా సత్కరించారు.మండలం నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు మండల ఎంఈఓ తోపాటు పలువురు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
జిల్లా స్థాయిలో నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES