- Advertisement -
ప్రపంచ వుషూ చాంపియన్‌షిప్స్
రియో (బ్రెజిల్) : వుషూ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ చరిత సష్టించింది. ఆదివారం జరిగిన పసిడి పోరులో ముగ్గురు భారత వుషూ అథ్లెట్లు బరిలో నిలువగా.. మూడు రజత పతకాలు టీమ్ ఇండియా దక్కించుకుంది. మహిళల 75 కేజీల విభాగంలో శివాని, మహిళల 52 కేజీల విభాగంలో అపర్ణ, మహిళల 60 కేజీల విభాగంలో కరీనాలు పసిడి పతకం తటిలో చేజార్చుకున్నారు. మెన్స్ 56 కేజీల విభాగంలో సాగర్ కాంస్య పతకం సాధించాడు. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ తొలిసారి నాలుగు పతకాలతో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది.
- Advertisement -