Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు

హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు

- Advertisement -

ప్రమాణస్వీకారం చేయించిన సీజే జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ రామకృష్ణా రెడ్డి, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ గౌస్‌ మీరా మొహియుద్దీన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు. హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ నలుగురిని జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వారి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న ఆమోదముద్ర వేశారు. కాగా తెలంగాణ హైకోర్టులో సంఖ్యా పరంగా చూస్తే మొత్తం 42 మంది జడ్జిలు ఉండాలి. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన జడ్జీలతో కలిపి ప్రస్తుతం వీరి సంఖ్య 30కి చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -