Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంనలుగురు టెర్రరిస్టులు హ‌తం

నలుగురు టెర్రరిస్టులు హ‌తం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భద్రతాబలగాల తో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో యునైటెడ్‌ కుకీ నేషనల్‌ ఆర్మీ (UKNA) కి చెందిన నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.మణిపూర్‌లోని ఖన్పీ గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతాబలగాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఖన్పీ గ్రామంలో 17 మంది UKNA ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ బలగాలు, అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ డాన్‌ పేరుతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. దాంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

మిగతా 11 మంది ఉగ్రవాదులు పారిపోయారు. దాంతో పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపులు కొనసాగుతున్నాయని, ఖన్పీ గ్రామ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -